భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి (34) అకాల మరణం చెందారు. జాండిస్ బారిన పడిన విష్ణువర్ధన్ రెడ్డి… చికిత్స నిమిత్తం నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరినప్పటికీ ఫలితం లేకపోయింది. విష్ణువర్ధన్ రెడ్డికి భార్య, బాబు, పాప ఉన్నారు. విద్యార్థి దశ నుంచి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉంటూ వచ్చారు విష్ణు. ఈయన భార్య డాక్టర్ కావడం గమనార్హం. ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయిన ఎమ్.ఎల్.ఎ మహిపాల్ రెడ్డిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. మహీపాల్ రెడ్డికి కలిగిన తీరని పుత్రవియోగం పట్ల స్థానిక నాయకులు జైపాల్ ముదిరాజ్, శ్రీజ మూవీస్ అధినేత – ప్రముఖ దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం తీవ్ర సంతాపం తెలిపారు. ఆయనకు ఈ విషాదం నుంచి తెరుకునే మానసిక శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు!!
మహిపాల్ రెడ్డి కుమారుడి మృతికి విజయ్ భాస్కర్‌రెడ్డి సంతాపం
0
300
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


