Revanth Reddy : ఫౌంహౌస్ లో కేసీఆర్.. పార్టీల్లో కేటీఆర్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ నగరం విలవిల లాడుతుందన్నారు. ప్రజల గోసను కేటీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫౌంహౌస్ లో కేసీఆర్, పార్టీలలో కేటీఆర్ సేద తీరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేశామని చెప్పుకోవడానికి తండ్రి, కొడుకులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు.
సహాయం కోసం పేద ప్రజలు వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పాడైన రోడ్లను యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని కోరారు. ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడాలన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో రేపు (శుక్రవారం) కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.

Latest Articles

విద్యార్థులతో రేవంత్‌ బ్రేక్‌ఫాస్ట్‌

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ పాస్ట్‌ చేశారు. ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది ప్రభుత్వం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్