Heavy Rains: రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ సోమవారం తెరుచుకోనున్నాయి. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. . ములుగు జిల్లా ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు పీ.గౌతమ్‌, నిర్మల్‌ జిల్లాకు ముషారఫ్‌ అలీ, మంచిర్యాల జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోళికేరిని నియమించారు.

Latest Articles

నటనకు దక్కిన గౌరవం.. అనంత్‌ నాగ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

  కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్‌ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు అనంత్‌ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్