సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ ల వివరాలను భారత ఎన్నికల కమిషన్ కు సమర్పించి నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రతి ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు తేదీ, కొనుగోలుదారుడి పేరు, కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ డినామినేషన్ తో కూడిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఎస్ బీఐ చైర్మన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.ఎలక్టోరల్ బాండ్లను ఎన్ క్యాష్ చేసుకునే తేదీ, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లకు సంబంధించిన వివరాలను కూడా ఎన్నికల సంఘానికి అందజేసినట్లు ఎస్ బీఐ వివరిం చింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పారదర్శకత కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12న కార్యకలాపాలు ముగిసేలోగా ఈ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి వెల్లడిం చాలని ఎస్ బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ వివరాలను ఈ నెల 15వ తేదీన ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో బహిర్గతం చేయనుంది. 2024 ఫిబ్రవరి 15, మార్చి 11 తేదీల్లో ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి 2024 మార్చి 12న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్టోరల్ బాండ్ల డేటాను అందుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.