27.7 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

చంద్రబాబు ఇంటి నిర్మాణానికి లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్‌ సస్పెండ్‌

  చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ ను సస్పెండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవ సాయ భూమిలో గృహ నిర్మాణం చేసేం దుకు టీడీపీ నేతలు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చా రు. స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని కోరగా, డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌ 1.80 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలిం ది. గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్, సంయుక్త కలెక్టర్‌ శ్రీనివా సులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది.

   సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే నని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్‌ లక్ష డిమాండ్‌ చేశారని గత నెల 27న శాంతిపురం మండ లానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపి, అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసు లు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Latest Articles

కేరళలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా?

కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. పదేళ్ల వామపక్షాల పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్