స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కరెన్సీ నోట్ల కట్టలు కనబడితే ఎవరు మాత్రం తీసుకోకుండా ఉంటారు. ఆ నోట్లు కోసమే కదా ఎవరు ఏ పని చేసినా. అలాంటిది డబ్బులు మూట కళ్ల ముందే కనబడితే దాచుకోకుండా ఊరుకుంటారా? ఇలాంటి ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రోహతాస్ జిల్లా సాసారామ్ పట్టణ పరిధిలో ఉన్న సోన్ హైలెవల్ కాలువలో కరెన్సీ నోట్లు ప్రవహించాయి. చేపలు పట్టేందుకు మొరాదాబాద్ వంతెన వద్దకు వెళ్లిన కొందరికి నోట్ల మూట కనిపించింది. దీంతో వారు ఆ డబ్బును తీసుకునే పనిలో పడ్డారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలిసిపోయింది. ఇంకేముంది ఎవరికి వారు పోటాపోటీగా కాలువలోకి దిగి నోట్ల కోసం గాలింపు చేపట్టారు. అందినకాడికి డబ్బును ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
If it is money, people will do anything. They waded sewage water in a canal in #Sasaram town in #Rohtas district of #Bihar to collect bundles of sodden, rotten currency notes. #India #Rupees #MoneyHeist pic.twitter.com/0NCCCHKf7u
— Dev Raj (@JournoDevRaj) May 6, 2023