ఎన్నికల వేళ అభ్యర్థుల్లో క్రాస్‌ ఓటింగ్ టెన్షన్‌

ఎన్నికల వేళ అభ్యర్థుల గుండెల్లో క్రాస్‌ ఓటింగ్‌ గుబులు రేపుతోంది. గుర్తు కన్‌ఫ్యూజన్‌ ఎక్కడ తమ కొంప ముంచు తుందోననే టెన్షన్‌ పట్టుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఓకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఏపీ లీడర్లు మరింత కలవరపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ కోలాహలం నెలకొంది. తెలంగాణలో 17 పార్లమెంట్‌ స్థానాలకు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్ల మెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలకు క్రాస్‌ ఓటింగ్ గుబులు పట్టుకుంది. స్వతంత్ర్య అభ్యర్థులనయితే క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. ఒకరికి వేసే ఓటు మరొకరికి వేస్తే అన్న ఆందోళన వెంటాడుతోంది. ఇక ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న కారణంగా ఓటింగ్ విషయంలో మరింత గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది.

ఒకే గుర్తు ఇద్దరు అభ్యర్థులకు కేటాయించడం వల్ల క్రాస్‌ ఓటింగ్ జరిగే అవకాశముంది. అలాగే గుర్తును పోలిన గుర్తు ఉండటం వల్ల కూడా క్రాస్‌ ఓటింగ్ జరగవచ్చు. ఇక క్రాస్ ఓటింగ్ వల్ల గెలిచే అభ్యర్థి ఓడిపోవడం.. ఓడిపోయే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే క్రాస్‌ ఓటింగ్‌ నేతలను టెన్షన్‌కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఈవీఎంలలో వయోజనుడు ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే అదే గుర్తు. లోక్‌సభ ఎన్నికల్లో మరో వ్యక్తికి కేటాయించే అవకాశముంటుంది. ఇక్కడ కనుక ఓటర్‌ కన్‌ఫ్యూజ్‌ అయితే అభ్యర్థి కి క్రాస్‌ ఓటింగ్‌ షాక్‌ తగిలినట్టే. తమకు రావాల్సిన ఓటు మరొకరి లెక్కల్లోకి వెళ్లినట్టే. అందుకే క్రాస్‌ ఓటింగ్‌ పై నేతల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎక్కడ తమ ఓటుమికి క్రాస్‌ ఓటింగ్‌ అడ్డు తగులుతుం దోననే భయం వెంటాడుతోంది. ఇక తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఆ ఏరియాలో పార్టీ ప్రభావం లోక్‌సభ ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశముంది. ఎమ్మెల్యేలంతా ఒక పార్టీకి చెందిన వారైతే కనుక మరో పార్టీ ఎంపీ అభ్యర్థికి క్రాస్‌ ఓటింగ్‌ సెగ తగిలే ఛాన్స్‌ ఉంది. ఇలాంటి కారణాల వల్లే నేతల్లో ఆందోళన నెలకొంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్