స్వతంత్ర వెబ్ డెస్క్: ఈనెల 16వ తేదీన లేదా 18 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కాంగ్రెస్ బస్సు యాత్రకు బ్రేక్ వేస్తు కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. ఈనెల 15వ తేదీన ప్రారంభం కావాల్సిన తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర దసరా తర్వాత రోడ్డు ఎక్కాలా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకుండా క్షేత్రస్థాయికి వెళితే అసలు ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ అధిష్టానానికి చాలా ఫిర్యాదులు వచ్చాయట. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రను దసరా తర్వాత ప్రారంభించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అభ్యర్థుల ప్రకటన మరియు టికెట్ దక్కని నేతల అసమ్మతి చల్లారాక యాత్రను ప్రారంభిస్తే… మంచిదని ఓ నిర్ణయానికి వచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. టికెట్ల ప్రకటనతో యాత్ర ప్రారంభించి ఎన్నికల వరకు కొనసాగించే ఛాన్స్ ఉంది.
ఈనెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ?
0
430
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


