స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ బిడ్డను మిస్సవుతున్నాను అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై హిమాన్షు స్పందించాడు. “నాన్నా… గతంలో మిమ్మల్ని రోజుకు ఒకసారైనా కలిసేవాడ్ని, వారంలో ఒకరోజైనా కలిసి భోజనం చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మిమ్మల్ని వర్చువల్ గా కలవడం, మీ కోసం నెలల తరబడి ఆరాటపడడం చూస్తుంటే ఎంతో అసాధారణంగా అనిపిస్తోంది. కానీ మీరు చెప్పినట్టుగా ‘విజయం తాగ్యాన్ని కోరుకుంటుంది’ అనేది ఇన్నేళ్ల మీ ప్రస్థానానికి నిజమైన గీటురాయిలా నిలుస్తుంది. నేను మీ కొడుకునైనందుకు ఎంతో గర్విస్తున్నాను. నేను ఎంతో మెరుగైన వ్యక్తిగా మారడానికి, మంచి చేయడానికి అదే నాకు అతి పెద్ద ప్రేరణ” అంటూ హిమాన్షు వివరించారు. కాగా, తండ్రీకొడుకుల మధ్య అనుబంధానికి నిదర్శనంలా నిలుస్తున్న ఈ సోషల్ మీడియా పోస్టులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.