పసిపిల్లల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారంగా కుళ్లిన గుడ్లు ఇస్తున్నారని అన్నారు. భువనగిరి, పెద్దవాడ సమ్మద్ చౌరస్తా అంగన్‌వాడీ కేంద్రంలో..ఆ కుళ్లిన గుడ్లు చిన్న పిల్లలు తింటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ? అని ప్రశ్నించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓ వైపు గురుకులాల్లో మరణాలు.. మరోవైపు అంగన్‌వాడీల్లో అడుగడుగునా అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. పిల్లల పాలిట యమపాశంగా కాంగ్రెస్ సర్కార్ తయారైందని అన్నారు కేటీఆర్.
పసి పిల్లల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం – కేటీఆర్
0
200
Previous article
Next article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


