తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత… సీఎం కాకుండా విజయ్‌ను అడ్డుకుంటున్నారని ప్రచారం

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్‌ విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు జల్లికట్టు ప్రొటెస్ట్‌ (2017 Jallikattu protests) తరహాలో చెన్నైలోని మెరీనా బీచ్‌( Marina Beach) వద్ద భారీ నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తున్నారు. “విజయ్‌కు న్యాయం చేయాలి”, “ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి” వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టులపై తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పర్యవేక్షణ పెంచినట్లు సమాచారం. ముఖ్యంగా మెరీనా బీచ్ పరిసరాల్లో పరిస్థితిని గమనిస్తూ, ప్రజలను వదంతులు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్