వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్‌గోముల్ పోలీసు స్టేషన్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం సమయంలో ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారని పూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాఘవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జై పాలస్తీనా అని అసదుద్దీన్ ఓవైసీ నినదించడానాన్ని తప్పు పట్టారు. అసదుద్దీన్‌పై కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసి, పీడీ యాక్ట్ పెట్టాలని, దేశ ప్రజలకు ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.