మరోసారి అధికారంలోకి వస్తున్నాం- జగన్

  ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐప్యాక్ ప్రతి నిధులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యానికి గురవుతుందని అన్నారు. మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిశోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం గతంలో మరింత మంచి చేసేందుకు కార్యచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తు్న్నామని జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగు తుందని అన్నారు. 2019లో చూసిన విజయానికి కంటే మరింత భారీ విజయం సాధించబోతు న్నామని అన్నారు.

   ఏపీ ఫలితాలపై ఇటీవల ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం పరిచారు. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారని అన్నారు. ఆయన ప్రొవైడర్‌ మోడ్‌ లోనే ఉండిపోయారని, చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టారని విమర్శించారు. ఆయన పాలనలో అనేక తప్పిదాలు జరిగాయని వాటిలో ప్రజగలకు నగదు బదిలీ చేసి ఉద్యోగాలు కల్పించలేదని వివరిం చారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌ మాదిరిగానే పనిచేశారని పేర్కొన్నారు. తాజాగా.. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్