పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. వరుస సభలు, కార్నర్ మీటింగుల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీపై విరుచుకు పడుతూనే మరోవైపు కేంద్రంలో మోదీ సర్కార్‌పైనా విమర్శలు ఎక్కి పెడుతున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయమే చేశాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. ఇవాళ కోరుట్లలో జనజాతర సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్లలో ఈ సభకు హాజరవుతారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. మళ్లీ రాత్రి 7 గంటలకు కూకట్‌పల్లి కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి… రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ సభ, కార్నర్ మీటింగులకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో చేస్తున్నారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన
0
206
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


