నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సైతం హస్తినకు వెళ్లనున్నారు. సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి వీరు హాజరుకానున్నారు.

దేశవ్యాప్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ స్థానాలపై చర్చించి.. అనంతరం అభ్యర్థుల ఫైర్లను సీఈసీ ఫైనల్ చేయనుంది. తెలంగాణలో సైతం మరో నాలుగు పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపికపై సీఈసీలో చర్చించేందుకు తెలంగాణ నుండి రేవంత్, భట్టి, మున్షీ ఢిల్లీకి వెళ్తున్నారు. సీఈసీలో చర్చించిన అనంతరం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న లోక్ స్థానాల అభ్యర్థుల పేర్లను రేపు రాత్రి లేదా సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గానూ కాంగ్రెస్ 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నాలుగు స్థానాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్