స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ఆలోచనలతో రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరారు సీఎం కేసీఆర్. ఢిల్లీ చేరుకున్న సీఎంను బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 5 నిముషాలకు ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. పార్టీ కార్యాలయంలో హోమం, యాగం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.