స్వతంత్ర, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు వేదపండితులు. ముఖ్యమంత్రితో పాటు శాంతి యజ్ఞంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖా మంత్రి కొట్టు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత లక్ష్మీ మహా యజ్ఞంలోనూ సీఎం జగన్ పాల్గొన్నారు.
తాడేపల్లిలో శాంతి యజ్ఞం నిర్వహించిన సీఎం జగన్
0
236
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


