నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి పీ4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.