రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందజేస్తామని అన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ జిల్లా తాహెర్ కొండాపూర్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఆధార్ కార్డు లాగే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛను, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయని తెలిపారు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోవచ్చన్నారు. డిజిటల్ గుర్తింపు కార్డు ఫ్యామిలీ పెద్దగా మహిళ పేరే ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.