ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున.. కాకినాడలో 4, గుంటూరు మరియు విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జీబీఎస్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సత్యకుమార్, వైద్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జీబీఎస్ వ్యాధిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు.