పరీక్షకు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ను అధిగమించడానికి మహారాష్ట్ర సతార జిల్లాకు చెందిన ఓ విద్యార్థి అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడు. సమర్థ్ మహాంగడే అనే ఈ స్టూడెంట్ పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు.
సమర్థ్.. కామర్స్ మొదటి సంవత్సరం విద్యార్థి. పసర్ని గ్రామంలో ఉన్న పరీక్షా కేంద్రానికి ఎందుకు రాలేదని అతని స్నేహితులు ఫోన్ చేసి అడిగినప్పుడు అతను పంచగనిలో ఉన్నాడు. పంచగని అనేది ఓ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఇక్కడ సమర్థ్ జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు. అతను ఉన్న ప్రదేశానికి పరీక్షా కేంద్రం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలింది. ను అప్పుడు బయల్దేరినా తాను ట్రాఫిక్‌లో చిక్కుకుపోతానని తెలుసుకున్నాడు.
తాను గాలిలో ఎగురుతూ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సమర్థ్ నిర్ణయించుకున్నాడు. అతను పారాగ్లైడింగ్ గేర్ ధరించి, స్ట్రాప్ పెట్టుకుని గాలిలో ఎగిరాడు.
ఓ విద్యార్థి కాలేజ్ బ్యాగ్ వేసుకుని గాలిలో ఎగురుతూ పరీక్షా కేంద్రంలోకి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎడ్వంచర్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ గోవింద్ యెవాలె సహాయం తీసుకుని సమర్థ్ ఈ సాహసం చేశాడు. యెవాలే తన బృందం సహాయంతో సమర్థ్ కోసం ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతంపై పారాగ్లైడింగ్ ట్రిప్‌ను ఏర్పాటు చేశాడు.
అనుభవజ్ఞులైన పారాగ్లైడింగ్ శిక్షకుల పర్యవేక్షణలో, పరీక్షకు మరికొన్ని నిమిషాలు ఉండగా.. సమర్థ్ తన పరీక్షా కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నాడు.
పశ్చిమ మహారాష్ట్రలోని సతారాలో పారాగ్లైడింగ్ కు అనువైన అనేక ప్రాంతాలు ఉన్నాయి.