లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముగ్గురు మంత్రుల సాక్షిగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ కార్యక ర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఈ గొడవకు కారణమైంది. దీంతో ముగ్గురు మంత్రుల సమక్షంలోనే రగడ కొనసాగింది. కొందరు పని తక్కువ చేస్తూ..ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని, ఈ సమావేశానికి కొందరు మండల అధ్యక్షులు కూడా రాలేదని రేణుకా చౌదరి అన్నారు. అయితే రేణుకాచౌదరి ప్రసంగాన్ని అడ్డుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ వర్గీయులు దీంతో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. కాంగ్రెస్ సమావేశం రేణుకా చౌదరి వర్సెస్ భట్టి విక్రమార్కగా మారిపోవడంతో అక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకొని కార్యకర్తలకు సర్ది చెప్పారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందరూ సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు.
ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు
0
182
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


