క్యాన్సర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

స్వతంత్ర, వెబ్ డెస్క్: క్యాన్సర్ బారిన పడ్డారంటూ వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. తాను అలా అనలేదని.. తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. చిరుకు క్యాన్సర్ అంటూ వార్తలు రావడంపై ఆయన శ్రేయాభిలాషులు, ఫ్యాన్స్ ఫోన్లు చేస్తూ ఆరోగ్యం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఈ వార్తలపై చిరంజీవి క్లారిటీ ఇస్టూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

”కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్‌ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polypsని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు/ స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.

”అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్‌లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు చిరుకు ఏమి కాలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్