స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు 7 గంటల పాటు అవినాశ్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. వివేకా హత్య రోజు జరిగిన వాట్సాప్ కాల్స్‌పై సుదీర్ఘంగా విచారించి.. ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభంకాగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. విచారణలో భాగంగా అవినాశ్ వ్యక్తిగత మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరింత విచారణ కోసం వచ్చే శనివారం అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో అధికారులు ప్రశ్నించనున్నారు. ఒకవేళ ఈలోపు ఏమైనా కీలక సమాచారం కావాలని సీబీఐ భావిస్తే మరోసారి నోటీసు జారీ చేసి విచారించే అవకాశం ఉందని సమాచారం. కాగా మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.