తెలుగు తెరపైకి ‘చే’గువేరా బయోపిక్

తెలుగు తెరపై మరో బయోపిక్ రాబోతోంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం “చే”. లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా లాంచ్ చేసి చిత్రయూనిట్‌ను అభినందించారు..

అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ… ‘‘విప్లవ వీరుడు, యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపోందించాం. ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తికాగానే…త్వరలో సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదీని అనౌన్స్ చేస్తాం’’ అని తెలిపారు..

నటీనటులు లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్…
నిర్మాతలు : సూర్య , బాబు , దేవేంద్ర
కో డైరెక్టర్ : నాని బాబు
రచయిత, దర్శకుడు : బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్ : నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్ : వివ రెడ్డి పోస్టర్స్
డి.ఓ.పి : జగదీష్
ఎడిటర్ : శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పీఆర్వో: దయ్యాల అశోక్

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్