Ambajipeta Marriage Band: సుహాస్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్

కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి హిట్ చిత్రాలతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం సుహాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రబృందం.

కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సుహాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా టీజర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

నటీనటులు – సుహాస్, జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు

టెక్నికల్ టీమ్ –

సంగీతం – శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్,

ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్

పీఆర్వో – జీఎస్ కే మీడియా

బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్

రచన దర్శకత్వం – దుశ్యంత్ కటికినేని

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్