చార్మినార్, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడి దొంగల బీభత్సం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సింగరాయకొండ – కావలి రైల్వే రూట్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దొంగలు(robbers ) దోపిడికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుండి చెన్నై వెళ్లే హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో( Hyderabad Express) దొంగలు చోరీ చేశారు. ఎస్ 2, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 7, ఎస్ 8 బోగీల్లో దోపిడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగానే సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్‌లో(Charminar Express) సైతం చోరీ జరిగింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఎస్ 1, ఎస్ 2 బోగీల్లో దొంగలు బీభత్సం సృష్టించారు.

కాగా, అర్థరాత్రి 1.20 నుండి 1.50 నిమిషాల మధ్య ఈ దోపిడీ ఘటనలు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రయాణికులు తెట్టు, కావాలిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి చేసి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్