జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏటా ఆగస్టు 15 న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయులను మనసారా తలుచుకుంటాం.  రేపు వాడవాడలా, ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగురనుంది. దేశం మొత్తం పంద్రాగస్టు వేడుకల్లో మునిగిపోతుంది.

దేశం మొత్తం ఊరూరా జెండా వందన కార్యక్రమాలు జరగనున్నాయి. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి వాడలో, ప్రతి వీధిలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు కనిపిస్తాయి. జెండా వందనం చేయడం కంటే తప్పులు దొర్లకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. జెండా వందనంలో తప్పులేముంటాయని అనుకోవద్దు..

జెండా వందనం అంటే మొక్కుబడి తతంగం కాదు. జెండా వందనం అంటే దేశ సమగ్రతకు చిహ్నం. దేశ ఐక్యతకు నిదర్శనం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జెండా వందన కార్యక్రమానికి సహజంగానే పాటించాల్సిన నియమ నిబంధనలేంటో తెలుసుకుందాం..

జాతీయ జెండాకు ఓ నిర్దిష్టమైన పరిమాణం నిష్పత్తి ఉంటుంది. జెండా పొడుగు, ఎత్తు అనేవి 3:2 గా  (6300X4200 మిల్లీ మీటర్ల నుంచి 150X100 మిల్లి మీటర్ల వరకు) ఉండాలి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పరిమాణంలో హెచ్చుతగ్గులుండకూడదు. జెండాకు వాడే వస్త్రం కాటన్ లేదా సిల్క్ అయుండాలి.

లేదా హ్యాండ్‌లూమ్ అయినా ఫరవాలేదు. ఎందుకంటే కాషాయం శక్తి,సామర్ధ్యాలకు ప్రతీక అయితే, తెలుపు శాంతి, సమృద్ధికి చిహ్నం. ఇక ఆకుపచ్చ అనేది త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వాలకు నిదర్శనం. ఇక అశోక చక్రం అనేది ధర్మానికి ప్రతీక.

జాతీయ జెండా పొరపాటున కూడా నేలను తాకకూడదు. అగౌరవపర్చకూడదు. నీటిలో వేయకూడదు. చిరిగిన, పాడైపోయిన, మసిబారిన జెండాను వాడితే అది జాతీయ జెండాను అగౌరవపర్చడమే అవుతుంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా కింద శిక్షార్హులౌతారు.

జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా ఎవరైనా ఎగురవేయవచ్చు. ముఖ్యంగా విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా ఎగురవేయాలి. జెండా ఎగురవేసే ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఫార్మల్ దుస్తులు ధరించాలి. జెండాను ఎగురవేసేటప్పుడు వేగాన్ని, దించేటప్పుడు నెమ్మదిని ప్రదర్శించాలి.

చేయకూడని తప్పులు
జాతీయ జెండాను మత, రాజకీయ ప్రయోజనాలకు వాడకూడదు. జాతీయ జెండాను అలంకరణకు వినియోగించకూడదు. టేబుల్ క్లాత్, హ్యాండ్ కర్చీఫ్, డిస్పోజబుల్ ఐటమ్‌గా జాతీయ జెండా ఉండకూడదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు జెండాను ఎగురవేయాలి. జాతీయ జెండా కంటే మరేదీ ఎత్తులో ఉంచకూడదు. జెండాపై ఏ విధమైన వస్తువులుంచకూడదు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్