28.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

ఏపీలో జనరంజకంగా సాగిన చంద్రబాబు ప్రమాణ స్వీకరణోత్సవం

    ఏపీలో అత్యంత వైభవంగా, అట్టహాసంగా ప్రమాణోత్సవం సాగింది. కూటమి సర్కార్‌ కొలువుదీరే క్రమంలో సీఎంగా చంద్రబాబుతోపాటు 24 మంది రాష్ట్ర మంత్రులుగా తమ బాధ్యతలను అంతః కరణశుద్ధితో నిర్వర్తిస్తామంటూ ప్రమాణం చేశారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకకు జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతోపాటు, సినీ ప్రముఖులు తరలి రావడంతో సందడి వాతారవణం నెలకొంది. కుటుంబ సభ్యుల సంతోషాలు, అభిమానుల నినాదాలు, ఆనందోత్సాహం మధ్య ప్రమాణ పండుగ సాగింది.

   ఏపీలో ప్రమాణోత్సవ సందడితో రాష్ట్రంలో కోలాహలం నెలకొంది. కూటమి సర్కార్‌ కొలువుదీరిన వేళ.. అట్టహాసంగా, అత్యంత వైభవంగా సీఎంగా చంద్రబాబు సహా 24 మంది మంత్రివర్గ సభ్యులు అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే సహా పలు రాష్ట్రాల నేతలు హాజరయ్యారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీకి గన్నవ రం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికిన చంద్రబాబు ఆయనతో కలిసి సభా స్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత భారీ జనసందోహం, అభిమానుల కోలాహలం నడుమ చంద్రబాబు అను నేను అంటూ.. టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోదీ సహా అక్కడున్న ప్రముఖులంతా చంద్రబాబుకు విషెష్ తెలిపారు. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, విభజన తర్వాత ఏపీలో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన నాల్గవసారి సీఎంగా మరోసారి ప్రమాణం చేశారు. కార్యక్రమానికి చంద్రబాబు ఫ్యామిలీ కూడా హాజరయ్యారు.

    ఇక రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి అయిన డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ప్రమాణాన్ని సాగించారు. ఈ సందర్భగా అభిమానుల కేరింతలు నినాదాలతో ప్రాంగణ స్థలం దద్దరిల్లిపోయింది. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు మెగా ఫ్యామిలీ కదిలివచ్చింది. స్పెషల్‌ గెస్ట్‌గా మెగా స్టార్‌ చిరంజీవి వేదికను అలంకరించగా.. నాగబాబు, సురేఖ, సాయి దుర్గాతేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు. అలాగే రామ్‌చరణ్‌ కూడా కార్యక్రమానికి రావడంతో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. చెర్రీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఫ్యాన్స్‌. ఇక ప్రమాణం అనంతరం అందరి నుంచి శుభాకాంక్షలు అందుకున్న సేనాని, అన్న చిరంజీవి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోపక్క పవన్‌కల్యాణ్‌ ప్రమాణం చేస్తుండగా ఆయన సతీమణి కెమెరా పట్టుకుని షూట్‌ చేస్తూ సంతోషంగా కనిపించారు.

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తల్లీదండ్రులుకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. లోకేశ్ ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ చప్పట్లు కొడుతూ సంతోషంగా కనిపించారు. అయితే లోకేష్‌ రెండవసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లోకేష్‌ ప్రమాణస్వీకారం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. టెక్కలి నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు అచ్చెన్నాయుడు

మంత్రులుగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌, నిమ్మల రామానా యుడు, ఫరూఖ్‌ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, ఆనం రామానారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్య ప్రసాద్‌, కొలుసు పార్థసారథి, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌ సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, ఎం.రాంప్రసాద్‌రెడ్డిలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరంతా ప్రమాణం చేస్తున్న సమయంలో వారి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రమాణ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది.

మరోపక్క ప్రమాణస్వీకారం అనంతరం వేదికపై మెగా బ్రదర్స్‌తో ప్రధాని మోదీ సందడి చేశారు. తమ్ముడు పవన్‌ కల్యాన్‌ను చేయి పట్టుకుని చిరంజీవి వద్దకు తీసుకువచ్చి ఇద్దరితో కలిసి మాట్లాడారు. అనంత రం వారి చేతులు పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు మోదీ. ఇక ప్రమాణోత్సవానికి హాజరైన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అతిధులు, తన కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యా యంగా పలకరిస్తూ సభా ప్రాంగణం అంతా తిరుగుతూ సందడిగా కనిపించారు. మెగా స్టార్ చిరంజీవి, రజినీ కాంత్‌లకు స్వాగతం పలికారు. ప్రమాణస్వీకారం అనంతరం తన అల్లుడు నారా లోకేష్‌ తనకు పాదాభివందనం చేయగా ఆశీర్వదించారు. అలాగే తన సోదరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనే శ్వరిని ఆప్యాయతతో నుదుటిపై ముద్దాడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పురందేశ్వరిని కూడా ఆప్యాయం గా పలకరించారు. మొత్తానికి ఇలా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో ప్రమాణోత్సవం అట్ట హాసంగా సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య సాగింది. మెగా, నందమూరి, నారా వారి ఫ్యామిలీ మెంబర్లు తరలిరావడంతో సందడి మరింత పెరిగింది.

Latest Articles

నిరుద్యోగులను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు – చనగాని దయాకర్

నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న కేటీఆర్.. గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్