స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కాగా… ఆయన కేసును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కోర్టు ప్రొసీడింగ్స్ కోసం నిద్ర లేకుండా ఎదురుచూసిన ఆయన… కనీసం విశ్రాంతి తీసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదనలు వినిపించారు. అక్కడినుంచి ప్రతిరోజు కోర్టులో వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.
తాజాగా, సిద్ధార్థ లూథ్రా ఎక్స్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇవాళ్టి నినాదం ఇదే అంటూ గురు గోబింద్ సింగ్ ప్రవచనాలను పంచుకున్నారు.”అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే… ఇక చేతిలోకి కత్తి తీసుకోవడమే మిగిలింది. శక్తి ఉన్నంతవరకు పోరాడడమే మార్గం” అని ఆ ప్రవచనాలలో గురు గోబింద్ పేర్కొన్నారు. నాడు ఔరంగజేబ్ ను ఉద్దేశించి గురు గోబింద్ సింగ్ రాసిన జాఫర్ నామాలో ఈ ప్రవచనాలు ఉన్నాయి.