స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఇవాళ నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాధలు చెప్పుకోవడానికి దుర్గమ్మను దర్శించుకున్నానని, బాబును రక్షించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు పోరాడుతున్నానని, ఆయనకు ప్రతిఒక్కరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ‘చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నా.. రాష్ట్ర శ్రేయస్సు కోసమే చంద్రబాబు పోరాటం.. చంద్రబాబుకు ప్రజల మద్దతు ఉంది. చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం చేయాలి’ అని భువనేశ్వరి తెలిపారు.