ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత విద్యా శాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీయే సర్కార్ కసరత్తు చేస్తుంది. మెగా డీఎస్సీతో పాటు మరో 8 వేల 168 ఖాళీలను భర్తీ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపై ఏపీ సీఎం ఆరా తీస్తున్నారు. కేజీబీవీల్లో 4 వేల 594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేయొచ్చని అధికారులు వెల్లడించారు.అలాగే, 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం అదనంగా సృష్టించనుంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2వేల 962 SGT పోస్టులను సృష్టించవచ్చన్న విద్యా శాఖ అధికారులు చూస్తున్నారు. గత ప్రభుత్వం 600కు పైగా SGT పోస్టులను రద్దు చేసిందని సీఎంకు అధికారులు వివరించారు. తమ శాఖలో ఇంకా8 వేల168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విద్యా శాఖ తరహాలోనే మిగిలిన శాఖల్లోనూ పోస్టుల భర్తీ చేయాలనే యోచనలో ఏపీ సీఎం ఉన్నారు.