హైదరాబాద్ HICC లో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభంకానున్నాయి. 12 వ ప్రపంచ తెలుగు మహాసభలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు భాషను పరిరక్షించేందుకు , తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారు . మూడు రోజుల పాటు తెలుగు మహాసభల్లో వివిధ కార్యక్రమాలు జరగబోతున్నాయి. తెలుగు మహాసభలలో సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. తెలుగు భాషా అభిమానులు, తెలుగు రచయితలు, రాజకీయ, సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరవబోతున్నారు. తెలుగు మహాసభల ద్వారా తెలుగు భాష గొప్పదనాన్ని చాటుతామని తెలుగు మహాసభల నిర్వాహకులు అంటున్నారు.