ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న విచరాణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ తర్వాత అధికారులను విచారించే చాన్స్ ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌కి ఈడీ నోటీసులు ఇచ్చింది. 7వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. దీనికి ఒక రోజు ముందు ఏసీబీ అధికారులు విచారణకు రావాలన్నారు.