ఎమ్మెల్సీ కవితకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. పదేండ్లు బీసీ జాతిని అణగదొక్కిన బీఆర్ఎస్ పార్టీ బిసిల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రిజర్వేషన్‌ని 23శాతానికి కుదించింది బీఆర్ఎస్ పార్టీ కాదా?కవిత చెప్పాలన్నారు. పదేండ్లు అగ్రవర్ణాలకే మీరు అంకితం అయ్యారు. బీసీలను అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీలకు ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరు. మీకపట ప్రేమ ముసలి కన్నీరును ఎవరు నమ్మరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రతిపాదించింది నేనే. అనుగుణంగానే బీసీ డెడికేషన్ కమిషన్ ను వేసి కుల సర్వే చేపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాలాంటి సామాన్య కార్యకర్తకు పీసీసీ అధ్యక్షుడిని చేయడంతో పాటు బీసీల డిపార్ట్మెంట్ లకు అత్యధిక నిధులు ఇచ్చింది. బీసీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే మమ్మల్ని ప్రజలు నమ్ముతారా,మిమ్మల్ని నమ్ముతారా? ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ధర్నా మీద ప్రజలకు అవగాహన కలగాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.