స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏపీకి చేసిందేమీ లేదని మంత్రి మేరుగు అన్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎన్ని రకాలుగానైనా మాట్లాడతారని, అప్పట్లో ప్రత్యేక హోదా సంజీవినా అన్న మాటలు ప్రజలు మర్చిపోలేదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్యాకేజీ ఇస్తున్నారంటూ కేంద్ర పెద్దలను సన్మానించిన సంగతి కూడా అందరికీ గుర్తుంది. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని మళ్లీ మాటలు మార్చుతారు?’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యింది. ఇక ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారు. టీడీపీ మునిగిపోయే పడవ. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. ప్రజలకు ఆయనేం షూరిటీ ఉంటారు?’’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు- మంత్రి మేరుగు
0
476
Previous article
Latest Articles
జార్ఖండ్ రాంచీలో టెన్షన్ టెన్షన్
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన జార్ఖండ్ బంద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాంచీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై టైర్లు కాల్చేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై...
- Advertisement -
- Advertisement -


