కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 356కి చేరగా.. ఇంకా చాలా మందికిపైగా ఆచూకీ లభించలేదు. మరో వైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వయనాడ్ బాధితులకు మేమున్నాం అంటూ పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తమ ప్రభుత్వం తరఫున 5కోట్ల రూపాయలు విరాళం ప్రకటించగా.. తమిళ, కేరళ నటులు కోట్లల్లో విరాళాలు ఇచ్చారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాంచరణ్ కలిపి కోటి రూపాయలు సాయం చేయగా, అల్లు అర్జున్ 25 లక్షలు రూపాయలు సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించారు. వీరితోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు తమకు తోచిన సాయం చేస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి.