స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వేగంగా వస్తున్న కారు, లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు హర్షిత, అంకిత, అమృత్, నితిన్‌గా గుర్తించారు. ప్రమాదసమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. కారులో ఉన్న మరో 8 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గండిపేట మండలం ఖానాపూర్‌లో జరిగింది. మృతులంతా నిజాంపేట్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా బ్యాచిలర్ పార్టీ కోసం ఒకే కారులో 12 మంది వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లారీని ఢీ కొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
0
435
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


