రాహుల్ గాంధీని లీడర్ అనడం కంటే రీడర్ అంటే బాగుంటుంది- KTR

స్వతంత్ర  వెబ్ డెస్క్:  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరుతారని వార్తలు రావడంతో దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. పొన్నాల లక్ష్మయ్య తమ పార్టీలో చేరుతామంటే సాదరంగా ఆహ్వానిస్తామని కేటీఆర్ అన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ పొన్నాల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో పిచ్చాపాటిగా కేటీఆర్… పొన్నాల అంశంపై స్పందించారు. పొన్నాల తమ పార్టీలో చేరుతామంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామన్నారు. త్వరలో చాలామంది ప్రముఖ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారన్నారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో తన్నుకుంటారన్నారు. ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి వస్తారన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లీడర్ అనడం కంటే రీడర్ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి ఆత్మగౌరవానికి, గుజరాత్ అహంకారానికి పోటీ జరుగుతోందన్నారు. తమపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని, సింగిల్ డిపాజిట్‌కే పరిమితమవుతుందన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి అవగాహన లేదన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్