మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల విచారణలో హత్య ఘటన బయటపడింది. తనను దూరం పెట్టిందని ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. హత్య తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకూడా పోయింది. తల్లి కనిపించకపోవడంతో మెదక్ టౌన్ పీఎస్‌లో కొడుకు శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు.
విచారణ చేపట్టిన పోలీసులు. మహిళ కాల్ డేటాలో ప్రియుడి నెంబర్ గుర్తించారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోవడంతో రేణుక.. తన ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ ఫతేనగర్‌లో ఉంటుంది. ఇంటిపక్కనే ఉంటున్న వ్యక్తితో రేణుకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందలించడంతో ఆ మహిళ ప్రియుడిని దూరంగా పెట్టింది. రేణుక దూరం పెట్టిందనే కక్షతో ప్రియుడు హత్యకు ప్లాన్ చేశాడు. హత్య చేసిన తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు.