కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం అంగరంగ జరిగింది. ప్రతీ ఏడాది మాదిరిగానే స్వామివారి రథ యాత్ర అశేష జన వాహిని నడుమ ఘనంగా సాగింది. రథోత్సవం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే వేద పండితులు తులసి అర్చన, కుంకుమ అర్చన, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని రథంపై ఆశీనులు చేసి గ్రామ పుర వీధుల్లో ఉరేగించారు. ఉత్సవాలు పురస్కరించుకుని స్వామివారి ఆలయంను వివిధ రకాల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరణ చేశారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.