లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనకు బీఆర్ఎస్ రెడీ

     తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయింది బీఆర్ఎస్‌. ఇవాళ 6 ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించనుంది. కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది.  తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశం నిర్వహిం చారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఉద్యమకాలం నుంచి సెంటి మెంట్ గా భావిస్తున్న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతోందని కేసీఆర్ జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు కేసీఆర్.అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, పార్లమెంటు ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్.

Latest Articles

12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్