బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధుల రెండో జాబితా విడుదలైంది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది.మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్లగొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించించగా.. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.
బీజేపీ రెండో జాబితా విడుదల
0
250
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


