Bank Holidays |వ్యాపార కార్యకలాపాలతో పాటు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకు సేవలు వినియోగించుకునే వారి శాతం ఎక్కువుగానే ఉంటుంది. డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికి రుణాల కోసమో లేదా ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు, విత్ డ్రాతో పాటు మరిన్ని బ్యాంకింగ్ రంగ సేవల కోసం ఇప్పటికి బ్యాంకులకు వెళ్తుంటారు చాలామంది. డిజిటల్ సేవలను వినియోగించుకునేవారి శాతం గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువుగా ఉంటాయి. గ్రామాల్లో రైతులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా మంది బ్యాంకింగ్ సేవల కోసం బ్యాంకులకు వెళ్తారు. మరోవైపు డిజిటల్ సేవలకు కొన్ని బ్యాంకులు సేవల ఆధారంగా సేవా రుసుములు వసూలు చేస్తున్న నేపథ్యంలో సేవా రుసుము తగ్గించుకోవడానికి బ్యాంకులకు వెళ్లి సేవలు పొందుతారు.
అయితే కొంతమందికి బ్యాంకు సెలవులపై అవగాహన ఉండదు. దీంతో బ్యాంకు పనికోసం తమ రోజువారి పనులను వాయిదా వేసుకునే సందర్భాలు చాలా చూస్తుంటాం. అయితే మార్చి నెలలో మొత్తం బ్యాంకులకు 12 సెలవు దినాలున్నాయి. మార్చి నెలలో 31 రోజులు కాగా.. బ్యాంకులు 19 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ సెలవు దినాల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. దేశంలో అన్ని బ్యాంకులకు 6 రోజులు సెలవులు కాగా.. మిగతా ఆరు రోజులు పండుగ సెలవులు. ఈ ఆరు సెలవులు మాత్రం ప్రాంతాలను బట్టి ఆధారపడి ఉంటాయి.
Bank Holidays |రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి నెలలో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులను ప్రకటించింది. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండో శనివారాలు రెండు ఉండగా.. మరో ఆరు పండుగ రోజులు ఉన్నాయి. మార్చి 5,12,19,26 తేదీలు ఆదివారాలు కాగా.. మార్చి 11, 25 తేదీలు రెండో శనివారం.
రెండో శనివారం, ఆదివారం కాకుండా మిగతా సెలవుల విషయానికొస్తే మార్చి 3 శుక్రవారం(చుప్‌చార్ కుట్-త్రిపుర రాజధాని అగర్తలలో సెలవు), మార్చి 7వ తేదీ మంగళవారం హోలీ పండుగ.. గువాహటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డెహ్రడూన్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో,ముంబై, నాగ్‌పూర్, పనాజీ, రాంచీ, శ్రీనగర్‌లలో సెలవు.
మార్చి 8:వ తేదీ బుధవారం హోలీ సెలవు అగర్తల, ఐజ్వాల్, అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, గ్యాంగ్‌టక్, ఇంపాల్, కాన్పూర్, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లాల్లో సెలవు, మార్చి 9వ తేదీ గురువారం హోలీ – పాట్నాలో బ్యాంకులకు సెలవు. మార్చి 22వ తేదీ బుధవారం తెలుగు సంవత్సరాది, ఉగాది, బీహార్ దివస్), మార్చి 30వ తేదీ గురువారం శ్రీరామనవమి. ఇలా మొత్తం మార్చి నెలలో బ్యాంకులకు 12 సెలవు దినాలుగా రిజర్వు బ్యాంకు ప్రకటించింది.