అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా

స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో అవినాశ్ ప్రధాన కుట్రదారు అని.. సీబీఐ నాలుగు సార్లు విచారణకు పిలిచినా ఏదో వంకతో హాజరుకావడం లేదని తెలిపారు. కేసు దర్యాప్తును అవినాశ్ ప్రభావితం చేస్తున్నారని.. అందుచేత బెయిల్ రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మే 31న తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ తీర్పును వైఎస్ వివేకా కూతరు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

 

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్