రంగారెడ్డి(Ranga Reddy ) జిల్లా రాజేంద్రనగర్‌లో కాలిన గాయాలతో ఓ మహిళ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 133 వద్ద ఓ మహిళ తీవ్రంగా కాలిపోయి అవస్థలు పడుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయాలతో కాలిపోయి ఉన్న ఆ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. బాధితురాలు అత్తాపూర్ కు చెందిన శివానిగా గుర్తించారు. అయితే ఈ ఘటన గురించి ఆమెను ఆరా తీయగా.. తన భర్తే తగులబెట్టాడని చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిజంగా భర్తే తగలబెట్టాడా? లేదా తనకు తానే తగలబెట్టుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాలిపోయిన శరీరంతో రోడ్డుపై మహిళ
0
365
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


