జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ ఘననివాళి

అణగారిన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఎం జగన్‌(CM Jagan) అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి సీఎం జగన్‌ ఘన నివాళులు అర్పించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.

సీఎం జగన్(CM Jagan) ట్వీట్ చేస్తూ.. ‘‘ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని కొనియాడారు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు పూలే అని పేర్కొన్నారు. ఆయన మార్గంలోనే మా పయనం కొనసాగుతుందని.. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇవే ఘన నివాళులు అని తెలిపారు.

Read Also: ఇది కో-ఆపరేటివ్ ఫెడరలిజమా?: మంత్రి కేటీఆర్
Follow us on:  Youtube Instagram Google News

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్