స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: లేడీ సింగంగా పేరు పొందిన అస్సాం పోలీసాఫీసర్ జున్ముణి రాభా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై అనుమనాలు వ్యక్తం చేస్తున్న ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. పోలీసు శాఖలోని కొందరు అధికారులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపారని పేర్కొంటున్న ఓ కానిస్టేబుల్ ఆ ఆడియో క్లిప్ విడుదల చేశాడు. మరోవైపు ప్రమాద సమయంలో రాభా వాహనం ట్రక్కును ఢీకొనలేదని ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఆమె కారు నిలిపే ఉందని, ట్రక్కు వచ్చి వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని తెలిపాడు. అయితే ట్రక్కు ఢీకొట్టే ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారన్నాడు. ఇప్పటికే రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
లేడీ సింగం మృతిపై అనుమానాలు.. ఆడియో, వీడియో క్లిప్పులు వైరల్
0
385
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


