Madya Pradesh | మధ్యప్రదేశ్లో ఆశా, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని.. గత 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నామని.. అయినా ప్రభుత్వం నోరు మెదపడటం లేదని అన్నారు. ఏదేమైన తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆశా, ఉషా వర్కర్ల గౌరవ వేతనాలను పెంచుతామని.. అలాగే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని 2021లో బీజేపి ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని.. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదని మండిపడ్డారు. ఎన్నో రోజుల నుంచి తమకు న్యాయం చేస్తారని వేచి చేస్తున్నామన్నారు. చూసి చూసి కళ్ళు కాయలు కాసాయే తప్ప, మాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. మా న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు.
రోడ్డెక్కిన ఆశా, ఉషా వర్కర్లు… గౌరవ వేతనాలు, రెగ్యులరైజ్ ఎక్కడ?
0
311
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


