Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. అళ్వార్ ట్యాంక్ వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. నిన్న శ్రీవారి సేవలో 85,450 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 43,862మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తులు చేసే నామమారణతో ఆలయం మార్మోగుతుంది. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి అళ్వార్ ట్యాంక్ వరకు వేచియున్న భక్తులు
0
331
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


